Rajendra Prasad: ఆసక్తిని రేపుతోన్న 'తోలుబొమ్మలాట' మోషన్ పోస్టర్

  • 'సోడాల్రాజు'గా రాజేంద్ర ప్రసాద్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిషోర్

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారిగా, గ్రామీణ నేపథ్యంలో 'తోలుబొమ్మలాట' రూపొందుతోంది. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. నేపథ్యంలో వీలునామాకి సంబంధించి వినిపించే మాటలతో ఈ మోషన్ పోస్టర్ ను వదిలిన తీరు బాగుంది.

రక్తసంబంధాలు .. ఆర్ధిక సంబంధాలుగా మారిపోయే నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే విషయం ఈ మోషన్ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. మధ్య వయస్కుడిగా రాజేంద్రప్రసాద్ లుక్ బాగుంది. ఈ సినిమాలో ఆయన 'సోడాల్రాజు'(సోమరాజు) అనే పాత్రలో కనిపించనున్నారు. దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్ .. విశ్వంత్ .. హర్షిత .. కల్పన .. ధన్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News