Chiranjeevi: మెగాభిమానులకు 'చిరు' కానుక... 152 మొదలైపోయింది!

  • 'సైరా' తరువాతి చిత్రం మొదలు
  • ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టిన సురేఖ
  • కొరటాల శివ దర్శకత్వంలో సినిమా

మెగాభిమానులకు శుభవార్త... 'సైరా' తరువాత చిరంజీవి నటించే చిత్రం పూజా కార్యక్రమాలతో ఈ ఉదయం ప్రారంభమైంది. మ్యాట్సీ ఎంటర్ టెయిన్ మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొరటాల శివ దర్శకుడు. సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలకు చిరంజీవితో పాటు రామ్ చరణ్, కొరటాల శివ, అంజనా దేవి, సురేఖ, సుస్మిత తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సురేఖ క్లాప్ కొట్టారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

More Telugu News