Gopichand: 'చాణక్య' విడుదలకి రంగం సిద్ధం

  • తిరు నుంచి 'చాణక్య'
  • గోపీచంద్ జోడీగా మెహ్రీన్ 
  • ఈ నెల 5న సినిమా రిలీజ్

గోపీచంద్ కథానాయకుడిగా 'తిరు' దర్శకత్వంలో రూపొందిన 'చాణక్య' .. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రను పోషించింది. విభిన్నమైన కథాకథనాలతో .. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.

సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అనిల్ సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. కొంతకాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న గోపీచంద్, ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందని భావిస్తున్నాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.

More Telugu News