Meharin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బోల్డ్ పాత్రలకు సిద్ధమంటున్న మెహరీన్ 
  • గోపీచంద్ సినిమాకి మాస్ టైటిల్ 
  • తెలుగులోకి మరో బాలీవుడ్ హిట్

*  ఎలాంటి పాత్రలు చేయడానికైనా తాను సిద్ధమేనని అంటోంది కథానాయిక మెహరీన్. 'పాత్ర ఎలాంటిది అనేది నేను చూడను. ఏ తరహా పాత్ర అయినా సరే చేయడానికి నేను రెడీ. బోల్డ్ పాత్రలైనా చేస్తాను. అయితే, ఆ పాత్రలో కాస్త విషయం వుండాలి, దానికి కథలో ప్రాధాన్యత వుండాలి' అని చెప్పింది మెహరీన్.    
*  గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ యాక్షన్ ప్రధాన చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'సీటీ మార్' అనే మాస్ టైటిల్ని పరిశీలిస్తున్నారు.
*  తాజా బాలీవుడ్ హిట్ చిత్రం 'డ్రీమ్ గాళ్'ను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం.

More Telugu News