Sharad Pawar: మరో పుల్వామా దాడి జరిగితేనే మహారాష్ట్రలో బీజేపీ గెలుస్తుంది: శరద్ పవార్

  • లోక్ సభ ఎన్నికలకు ముందు మోదీపై వ్యతిరేకత ఉంది
  • పుల్వామా దాడితో పరిస్థితులు మారిపోయాయి
  • మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి గెలవలేదు

లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని... కానీ, పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, మోదీ రెండో సారి ప్రధాని అయ్యారని చెప్పారు.

ఇప్పుడు మరో పుల్వామా తరహా ఘటన సంభవిస్తే తప్ప... మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి గెలవలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్సీపీ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బహుజన్ వికాస్ అగాథి, సమాజ్ వాదీ పార్టీలతో కలసి కాషాయ కూటమిని ఎదుర్కొంటామని చెప్పారు. ఎన్సీపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలిపారు.

More Telugu News