Washington DC: వైట్ హౌస్ కు సమీపంలో కాల్పుల కలకలం!

  • వైట్ హౌస్ కు 3 కిలోమీటర్ల దూరంలో కాల్పులు
  • నిన్న రాత్రి చోటు చేసుకున్న ఘటన 
  • ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వీధులు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ కు సమీపంలో ఉన్న వీధుల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వైట్ హౌస్ కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలంబియా హైట్స్ నైబర్ హుడ్ ప్రాంతంలో నిన్న రాత్రి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News