Surya: రేపే 'బందోబస్త్' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • కమాండో ఆఫీసర్ గా సూర్య 
  • కీలకమైన పాత్రలో మోహన్ లాల్ 
  • ఈ నెల 20వ తేదీన రెండు భాషల్లో విడుదల

సూర్య కథానాయకుడిగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తమిళంలో 'కాప్పాన్' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'బందోబస్త్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 'బందోబస్త్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ - మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ లో జరపనున్నారు. ఆ రోజున ఈ సినిమా వేడుక సాయంత్రం 6 గంటల నుంచి ఆరంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను వదిలింది. ఈ సినిమాలో కమాండో ఆఫీసర్ గా సూర్య కనిపించనున్నాడు. ఆయన సరసన సాయేషా సైగల్ నటించగా, ముఖ్యమైన పాత్రల్లో మోహన్ లాల్ .. ఆర్య కనిపించనున్నారు.

More Telugu News