Gopichand: ఇటలీలో 'చాణక్య' ఆట పాట

  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'చాణక్య'
  • మిలాన్ లో పాటల చిత్రీకరణ 
  • త్వరలో విడుదల తేదీ ప్రకటన

ఇటీవల కాలంలో గోపీచంద్ కి సరైన హిట్ పడలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన 'చాణక్య' చేస్తున్నాడు. 'తిరు' దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మాత రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఇటలీలోని అందమైన లొకేషన్స్ లో పాటల చిత్రీకరణకు ప్లాన్ చేశారు.

రాజు సుందరం కొరియోగ్రఫీలో ఇటలీ - మిలాన్ లో ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఇక్కడ చిత్రీకరించే పాటలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయని చెబుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో జరీన్ ఖాన్ కనిపించనుంది. తీవ్రవాదం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

More Telugu News