Tollywood: అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్ ‘అల.. వైకుంఠపురములో’!

  • దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్
  • పూజాహెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లు
  • కాంబినేషన్ పట్ల భారీ అంచనాలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బన్నీకి సంబంధించి 19వ సినిమా కావడంతో దీనిపై అభిమానులు, సినీవర్గాల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ను దర్శక నిర్మాతలు ప్రకటించారు. ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ప్రకటించింది. టైటిల్ కు సంబంధించి ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో బన్నీ కొత్త లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

More Telugu News