Aishwarya rajesh: 'కౌసల్య కృష్ణమూర్తి'కి హిట్ పడటం ఖాయమట

  • 'కౌసల్య కృష్ణమూర్తి'గా ఐశ్వర్య రాజేశ్
  • కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్ 
  • ఈ నెల 23వ తేదీన విడుదల

ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రధారిగా కేఎస్ రామారావు నిర్మించిన 'కౌసల్య కృష్ణమూర్తి' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "రీమేక్ అయినప్పటికీ ఒక స్ట్రెయిట్ సినిమాకంటే ఎక్కువగా కష్టపడి చేశాము. టీజర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి సినిమా చేశామనే మేమంతా అనుకుంటున్నాము. ఈ సినిమాను అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వుంది. రాజేంద్ర ప్రసాద్ .. శివకార్తికేయన్ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. సహజంగా అనిపించే కథాకథనాలు .. పాత్రలు - సన్నివేశాలు ప్రతి ఒక్కరి మనసుకు కనెక్ట్ అవుతాయి" అని చెప్పుకొచ్చారు.

More Telugu News