West Bengal: మహిళా ఖైదీపై రైలులో కానిస్టేబుల్ అత్యాచారం

  • కోర్టులో హాజరుపరిచి జైలుకు తీసుకెళ్తుండగా ఘటన
  • విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరింపు
  • ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

ఓ కేసులో కోర్టుకు హాజరైన మహిళా ఖైదీపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ‌పశ్చిమ బెంగాల్‌లో ఆగస్టు 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..  ఓ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 42 ఏళ్ల మహిళను విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లోని ముుర్షీదాబాద్ కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఓ పురుష కానిస్టేబుల్ ఆమెకు గార్డులుగా ఉన్నారు.

కోర్టు విచారణ అనంతరం గత శనివారం ఆమెను తీసుకుని తిరిగి ఢిల్లీ బయలుదేరారు. ఈ క్రమంలో ఖైదీపై కన్నేసిన కానిస్టేబుల్ ఆమె బాత్రూముకు వెళ్లిన సమయంలో మహిళా సిబ్బందిని వెనక్కి పంపి అతడు టాయిలెట్‌లో జొరబడి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. జైలుకు వెళ్లాక కానిస్టేబుల్ అఘాయిత్యాన్ని బాధితురాలు జైలు సూపరింటెండెంట్‌కు, జైలు వైద్యుడికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News