Adi saikumar: 'జోడి' మూవీ రిలీజ్ డేట్

  • మరో ప్రేమకథా చిత్రంగా 'జోడి'
  • ఆది సాయికుమార్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ 
  • సెప్టెంబర్ 6వ తేదీన విడుదల      

ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో 'జోడి' టైటిల్ తో ఒక ప్రేమకథా చిత్రాన్ని యువ దర్శకుడు విశ్వనాథ్ రూపొందించాడు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి వెంకటేశ్ - పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఫణి కల్యాణ్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'బుర్రకథ' తరువాత ఆది సాయికుమార్ నుంచి వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆది సాయికుమార్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News