Nirav Modi: ఓ నవలా నాయకుడి పేరుతో ఫేస్ బుక్ చాటింగ్ చేసిన నీరవ్ మోదీ

  • ఎడ్మండ్ డాంటెస్ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసిన నీరవ్
  • స్నేహితురాలు గ్లోరియాతో చాటింగ్
  • బహమాస్ లో తాత్కాలిక సంస్థకు నవల పేరు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ)ను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆ తర్వాత లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే, తన అసలు పేరుతో సోషల్ మీడియా ద్వారా మిత్రులతో చాటింగ్ చేస్తే దొరికిపోతానని భావించి నకిలీ ఐడీలు సృష్టించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎడ్మండ్ డాంటెస్ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసిన నీరవ్ తన స్నేహితురాలు గ్లోరియా స్కోల్నిక్ తో చాటింగ్ చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ఎడ్మండ్ డాంటెస్ అనేది 'ది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో' అనే సుప్రసిద్ధ ఫ్రెంచి నవలలో కథానాయకుడి పేరు. ఈ నవల 1844లో వచ్చింది. ఈ పుస్తకం అంటే తనకు ఎంతో ఇష్టమని నీరవ్ మోదీ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అంతేకాదు, అక్రమార్కులకు స్వర్గధామం అనదగ్గ బహమాస్ లో కూడా మాంటే క్రిస్టో వెంచర్స్ పేరుతో ఓ తాత్కాలిక సంస్థను స్థాపించాడు. ఇక, ఎడ్మండ్ డాంటెస్ ఐడీతో ఫేస్ బుక్ లో మార్సికా అట్మోడిమెజ్జో అనే వ్యక్తికి కూడా మెసేజ్ లు పంపినట్టు తెలిసింది.

More Telugu News