Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ

  • రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రత నమోదు
  • రాజధాని జకార్తాలోనూ ప్రకంపనలు
  • సుమత్రా దక్షిణ భాగంలో భూకంప కేంద్రం

పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ గా పేర్కొనే భూకంపాల జోన్ లో ఉన్న దేశం ఇండోనేషియా. తాజాగా ఇక్కడ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రత నమోదు కాగా, సునామీ హెచ్చరికలు జారీచేశారు. 3 మీటర్ల ఎత్తుతో రాకాసి అలలు తీరప్రాంతాలపై విరుచుకుపడొచ్చని అంచనా వేస్తున్నారు. ఇండోనేసియాకు చెందిన సుమత్రా దీవులకు దక్షిణాన భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంపం తాలూకు ప్రభావం రాజధాని జకార్తాలో కూడా కనిపించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేశారు. హోటళ్లలో భోజనం చేస్తున్నవాళ్లు తింటున్నవి కూడా వదిలేసి రోడ్లపైకి చేరుకున్నారు.

More Telugu News