Kumaraswamy: సీఎం పదవి శాశ్వతం కాదు: కుమారస్వామి

  • కర్ణాటక అసెంబ్లీ విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కూటమి
  • సీఎం పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి
  • బీజేపీ ధోరణి బాధ కలిగించిందంటూ వ్యాఖ్యలు

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో అధికారపీఠంపై కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కథ ముగిసింది. సీఎం కుమారస్వామి తన రాజీనామా లేఖను స్వయంగా గవర్నర్ వాజూభాయ్ వాలాకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కర్ణాటక ప్రజలు తనను క్షమించాలని కోరారు. పూర్తికాలం కొనసాగడంలో విఫలమయ్యానని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు చేయగలిగినంత మేలు చేశానని, రైతులకు రుణమాఫీ చేశానని వివరించారు. ఏడాదిగా క్షుద్రరాజకీయానికి బలవుతూ వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పదవి శాశ్వతం కాదని, బీజేపీ ధోరణి చాలా బాధ కలిగించిందని చెప్పారు.

More Telugu News