Nara Lokesh: జగన్ ఉంటే తన నివాసంలో.. లేదంటే కేసీఆర్ నివాసంలో..!: నారా లోకేశ్ సెటైర్

  • నాడు పట్టిసీమ దండగని వ్యాఖ్యానించారు
  • ప్రభుత్వం మాటలకే పరిమితమైంది
  • ప్రభుత్వం చేసే తప్పులను ప్రజా కోర్టులో పెడతాం

నాడు పట్టిసీమ దండగని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారని, నేడు ఆ జలాలు లేకుంటే ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఉండదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. నేడు పట్టిసీమ జలసిరి కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ, ఏపీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండానే నవరత్నాలు ప్రకటించారా? అని నిలదీశారు.

రైతులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడమే మానేసిందని, దీంతో తామే రైతులకు అండగా నిలిచామన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజా కోర్టులో పెడతామన్నారు. సీఎం ప్రజా సమస్యలు పట్టించుకోవడం మాని, తాడేపల్లిలోని తన నివాసంలోనో, లేదంటే హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలోనో ఉంటున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు.

More Telugu News