Nirav Modi: భారత్ 5000 పేజీల ఆధారాలు సమర్పించడంతో నీరవ్ మోదీ షాక్... ల్యాప్ టాప్ కావాలంటూ కోర్టుకు విజ్ఞప్తి!

  • న్యాయమూర్తికి విన్నవించిన మోదీ తరఫు న్యాయవాది
  • సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి
  • పీఎన్ బీ కేసులో లండన్ పారిపోయిన నీరవ్ మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర ముంచేసిన కేసులో విదేశాల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నీరవ్ మోదీ లండన్ లోని వాండ్స్ వార్త్ జైల్లో ఉన్నాడు. కాగా, నీరవ్ మోదీని స్వదేశానికి రప్పించే క్రమంలో అక్కడి కోర్టులో అప్పీల్ చేసిన కేంద్ర ప్రభుత్వం అతడికి వ్యతిరేకంగా 5000 పేజీలతో సాక్ష్యాధారాలు సమర్పించింది.

అయితే, తన క్లయింటు ఈ పేజీలన్నింటినీ పరిశీలించి తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా స్పందించాలంటే ఓ ల్యాప్ టాప్ అవసరమని నీరవ్ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్ కోర్టుకు విన్నవించారు. "నా క్లయింట్ తో స్వల్ప సమయంలో ఇన్ని పేజీలపై చర్చించాలంటే చాలాకష్టం" అంటూ పేర్కొన్నారు. ఆ ల్యాప్ టాప్ కు ఇంటర్నెట్ సదుపాయం అక్కర్లేదని, ఆ 5000 పేజీల సమాచారాన్ని అందులోకి లోడ్ చేస్తే సరిపోతుందని జెస్సికా జోన్స్ చెప్పారు. దాంతో ఆయన నీరవ్ మోదీకి అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తూ అతనికి సహకరించాల్సిందిగా జైలు వర్గాలను ఆదేశించారు.

More Telugu News