Maharashtra: గ్రామస్తులపై దాడి చేసిన ఆర్మీ కల్నల్, 40 మంది జవాన్లపై కేసు నమోదు

  • మహారాష్ట్రలోని ఓ గ్రామంలో భూమి కొనుగోలు చేసిన కల్నల్ తండ్రి
  • ఆ భూమిని తాను కొన్నానంటున్న సునీల్ అనే వ్యక్తి
  • తన బెటాలియన్ తో కలిసి దాడి చేసిన కల్నల్

మహారాష్ట్రలోని ఓ గ్రామ ప్రజలపై దాడి చేసిన ఘటనలో ఆర్మీ కల్నల్ తో పాటు మరో 40 మంది జవాన్లపై కేసు నమోదైంది. పూణెకు సమీపంలో ఉన్న రాజ్ గురు నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే, 64 ఎకరాల భూమిని కల్నల్ గైక్వాడ్ తండ్రి కొనుగోలు చేశారు. గ్రామంలో ఉన్న సునీల్ అనే వ్యక్తితో ఈ భూమికి సంబంధించి వివాదం ఉంది. గైక్వాడ్ తండ్రి ఆరోపణల ప్రకారం తాము కొన్న భూమిని సునీల్ కబ్జా చేశాడు. ఇదే సమయంలో ఈ భూమిని తాను కొన్నానని... చాలా కాలంగా ఇందులో తాను వ్యవసాయం చేస్తున్నానని సునీల్ వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ఈ నెల 14న గైక్వాడ్ తండ్రి, సునీల్ గొడవ పడ్డారు. హైదరాబాదులోని ఆర్టిలరీ యూనిట్ లో విధులు నిర్వహిస్తున్న గైక్వాడ్ కు ఈ సంగతి తెలిసింది. వెంటనే తన బెటాలియన్ లో ఉన్న 40 మంది జవాన్లను తీసుకుని తన గ్రామానికి గైక్వాడ్ వెళ్లారు. తమ వద్ద వున్న ఆయుధాలతో గ్రామస్తులపై వీరంతా విరుచుకుపడ్డారు.

ఈ దాడికి సంబంధించి కల్నల్ తో పాటు 40 మంది జవాన్లపై కేసు నమోదైంది. అంతేకాదు, కల్నల్ తో పాటు జవాన్లపై చర్యలు తీసుకోవడానికి ఇండియన్ ఆర్మీ నుంచి అనుమతి తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

More Telugu News