t congress: సీఎల్పీ విలీనంపై స్పీకర్ స్పందించక పోవడం దారుణం: టీజేఎస్ అధినేత కోదండరాం

  • అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్న స్పీకర్
  • ఇది ప్రజాస్వామ్య వైఖరికి విరుద్ధం
  • ఇటువంటి వైఖరితో న్యాయం ఎలా జరుగుతుంది?

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై హైదరాబాద్, ఇందిరాపార్కు వద్ద టీ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు టీడీపీ, టీజేఎస్ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడంపై ఆ  పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పందించకపోవడం దారుణమని అన్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన స్పీకర్ అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వైఖరికి విరుద్ధమని ధ్వజమెత్తారు. ఇటువంటి వైఖరితో సభలో తమకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.  

More Telugu News