Jagan: 42 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం!

  • కీలక మార్పులపై దృష్టి సారించిన జగన్
  • సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో అవసరానికి మించిన సిబ్బంది
  • 42 మందిని తొలగించాలని ఆదేశాలు జారీ

సీఎంగా వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రంలో కీలక మార్పులపై ద‌ృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు కీలక అధికారులను బదిలీ చేసిన కొత్త ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయంపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో సీఎంఆర్ఎఫ్‌ కార్యాలయంలో అవసరానికి మించి 42 మంది సిబ్బందిని నియమించినట్టు గుర్తించి, వారిని తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించిన మెమోను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విడుదల చేశారు.

More Telugu News