Telugudesam: ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలను సంతృప్తి పరచలేదు: టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు

  • ప్రజల ఆకాంక్షలు పెరిగిపోయాయి
  • ఎంత చేసినా తృప్తి చెందే పరిస్థితి లేదు
  • ఏ పార్టీ ప్రజల ఆకాంక్షలకు చేరువయ్యే అవకాశమే లేదు

ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలను సంతృప్తి పరచలేదని ఏపీ టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అతి త్వరలో ప్రజల అసంతృప్తికి గురి కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ప్రజల ఆకాంక్షలు పెరిగిపోయాయని, ఎంత చేసినా తృప్తి చెందట్లేదని అన్నారు.

ప్రజలు తృప్తి చెందట్లేదు కనుకనే నియోజకవర్గాల్లో నాయకులు పని చేసినా, అభివృద్ధి చేసినా, సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా, రాష్ట్రాన్నికష్టపడి అభివృద్ధి చేసినా పట్టించుకోవట్లేదని అన్నారు. ప్రజల్లో కాంక్ష పెరిగే కొద్దీ సంతృప్తి శాతం తగ్గిపోతోంది కనుక ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలను సంతృప్తి పరిచే పరిస్థితులు కనబడట్లేదని వ్యాఖ్యానించారు

. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా మారుతున్నాయని, ప్రజలు మార్పు కోరారని, ఆ మార్పు ఎంత కాలం నిలుస్తుందనేది పరిపాలించే వారిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎంత చేసినా ఐదేళ్లు పూర్తయ్యే సరికి వ్యతిరేక వస్తుందని, ఏ పార్టీ ప్రజల ఆకాంక్షలను చేరువయ్యే అవకాశమే లేదని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.

More Telugu News