ssrajamouli: 20న 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ నుంచి ఎన్టీఆర్‌ ప్రీలుక్‌ రిలీజ్‌?

  • ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం
  • చిత్రంలో కొమరం భీం పాత్ర పోషిస్తున్న తారక్‌
  • బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం

జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ఓ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారట ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఈనెల 20వ తేదీన జూనియర్‌ ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. తండ్రి హరికృష్ణ మరణించి ఇంకా ఏడాది కూడా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు జూనియర్‌ దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎటువంటి హడావుడి చేయవద్దని అభిమానులను కూడా కోరారు.

దీంతో ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఆయనకు ఓ వినూత్నమైన బహుమతిని ఇవ్వాలని రాజమౌళి నిశ్చయించుకున్నాడట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమరంభీం పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన ప్రీలుక్‌ను ఈనెల 20న రిలీజ్‌ చేసి తారక్‌ను ఆశ్చర్యపరచాలన్నది రాజమౌళి ఉద్దేశమట. ఇది ఎంత వరకు నిజమో ఆ రోజే తెలియాలి.

More Telugu News