nani: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నాని?

  • 'గ్యాంగ్ లీడర్' సినిమాతో బిజీగా నాని
  •  ఇంద్రగంటి సినిమాకి టైటిల్ ఖరారు
  •  గీతా ఆర్ట్స్ బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల

నాని కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'జెర్సీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆయనను తన తదుపరి చిత్రమైన 'గ్యాంగ్ లీడర్' పై దృష్టిపెట్టాడు. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రాజెక్టును కూడా నాని పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి 'వి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

అంతేకాదు ఈ ప్రాజెక్టు తరువాత సినిమాను కూడా నాని లైన్లో పెట్టేశాడని అంటున్నారు. ఇటీవల నానీని కలిసి శ్రీకాంత్ అడ్డాల ఒక కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలైన తరువాత, శ్రీకాంత్ అడ్డాలతో చేయడానికి కొంతమంది హీరోలు వెనుకడుగు వేశారు. 

More Telugu News