fani: తుపాను ముందస్తు చర్యలు.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు నిధులను విడుదల చేసిన కేంద్రం

  • తుపాను నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం
  • ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ లకు నిధులు
  • రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

ఫణి తుపాను భీకర తుపానుగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉండే రాష్ట్రాలకు ముందస్తుగా నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ లకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి రూ. 1086 కోట్లను విడుదల చేసింది. తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, తుపాను బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని నాలుగు రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

More Telugu News