Tamil Nadu: కొండప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లకు గాడిదలపై ఎన్నికల సామగ్రి తరలింపు

  • రెండో విడత పోలింగ్‌లో తమిళనాడులోని దృశ్యం ఇది
  • రవాణా సౌకర్యం లేక వీటి వినియోగం
  • పదకొండు కిలోమీటర్ల దూరం కాలినడకన సిబ్బంది

ఎంత అభివృద్ధి చెందామని చెప్పుకున్నా ఇప్పటికీ రవాణా సౌకర్యం అంతంతే అనేందుకు ఇదో ఉదాహరణ. గురువారం జరిగిన రెండో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు తమిళనాడులోని పలు పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలింపునకు గాడిదలు వినియోగించడం విశేషం.

 రాష్ట్రంలోని ధర్మపురి, దిండిగల్‌, ఈరోడ్‌, నమక్కల్‌, థేని తదితర జిల్లాల్లోని మారుమూల కొండ ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, ఎత్తయిన కొండప్రాంతాల్లో పోలింగ్‌ బూత్‌లు ఉండడంతో సామగ్రిని గాడిదల వీపుకు కట్టి, సిబ్బంది కాలినడకన ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఒకప్పుడు గాడిదలు మంచి రవాణా సాధనం. రైతులు, రజకుల వంటి వర్గాల వారు తమ దైనందిన అవసరాల కోసం వీటిని విరివిగా వాడే వారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాటిని పెంచుకునేవారు. ఇప్పటికీ వాటి సేవలు అక్కరకు వస్తుండడం విశేషం.

More Telugu News