Gowtham Tinnanuri: అనుకున్న సమయానికే ‘జెర్సీ’ని కచ్చితంగా రిలీజ్ చేస్తాం: నిర్మాత నాగవంశీ

  • నాని హీరోగా ‘జెర్సీ’
  • 12న థియేట్రికల్ ట్రైలర్
  • 15న ప్రి రిలీజ్ వేడుక            

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీపీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను చిత్ర నిర్మాత నాగవంశీ ప్రెస్‌మీట్ ద్వారా తెలిపారు.

ఏప్రిల్ 12న ఉదయం 9 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తామని, 15న ప్రి రిలీజ్ వేడుక అనుకుంటున్నట్టు తెలిపారు. కొందరు తనకు ఫోన్ చేసి, రిలీజ్ అనుకున్న సమయానికి జరగట్లేదా? అని అడిగారని, దీనికి సమాధానంగా ముందుగా అనుకున్న సమయానికి కచ్చితంగా అంటే ఈ నెల 19న రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, అవుట్ పుట్ బాగా వచ్చిందన్నారు.

More Telugu News