Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మణిరత్నం సినిమాలో నయనతార 
  • రవితేజ 'కనకదుర్గ' అప్ డేట్స్ 
  • పల్లెటూరి నేపథ్యంలో కల్యాణ్ రామ్ సినిమా 
  • బాలీవుడ్ కి వెళుతున్న ప్రణీత   

*  కథానాయిక నయనతార తొలిసారిగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలో నటించనుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో కీలక పాత్రకు నయనతారను తీసుకున్నట్టు తాజా సమాచారం .
*  రవితేజ నటించే 'కనకదుర్గ' చిత్రం షూటింగును ఈ నెల మూడో వారం నుంచి నిర్వహిస్తారు. తమిళ చిత్రం 'తేరి'కి రీమేక్ గా రూపొందే ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు.  
*  ప్రస్తుతం 'తుగ్లక్' చిత్రంలో నటిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ దీని తర్వాత విరించి వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇది పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది.
*  పలు తెలుగు సినిమాలలో నటించిన అందాలతార ప్రణీత ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. అజయ్ దేవగణ్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్న 'భుజ్' చిత్రంలో ప్రణీత కీలక పాత్రకు ఎంపికైంది. 

More Telugu News