mohanlal: 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోన్న 'లూసిఫెర్'

  • మోహన్ లాల్ తాజా చిత్రంగా 'లూసిఫెర్'
  • ముఖ్యమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ 
  • 6 రోజుల్లో 78 కోట్ల వసూళ్లు

మలయాళ కథానాయకుడు మోహన్ లాల్ నటించిన 'లూసిఫెర్' ఇటీవలే థియేటర్లకు వచ్చింది. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి 4 రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 6 రోజుల్లో 78 కోట్ల వసూళ్లను రాబట్టింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే, 100 కోట్ల మార్కును అందుకోవడం చాలా తేలికగా జరిగిపోతుందని అంటున్నారు.

పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ .. మంజు వారియర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వైవిధ్యభరితమైన కథాకథనాలు .. పాత్రల్లోని కొత్తదనం .. వాటిని మలిచిన తీరు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయని భావిస్తున్నారు. 'ఒడియన్' పరాజయంతో నిరాశ చెందిన మోహన్ లాల్ కి ఈ సినిమా ఊరటనిచ్చిందని చెబుతున్నారు.

More Telugu News