YSRCP: జగన్ సోదరి షర్మిలపై యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

  • షర్మిల మాట్లాడుతుండగా ప్రత్యక్ష ప్రసారం
  • యూట్యూబ్‌లో అనుచిత పోస్టింగులు
  • చౌటుప్పల్‌లో నిందితుడి అరెస్ట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ సోదరి షర్మిలపై యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టులు చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అమరావతిలో షర్మిల మాట్లాడుతుండగా ఓ టీవీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనిని చూస్తున్న చౌటుప్పల్ రాంనగర్ ప్రాంతానికి చెందిన దివి హరిబాబు (39) మూడుసార్లు వరుసగా యూట్యూబ్‌లో అసభ్యకర పోస్టులు చేశాడు.

అతడి పోస్టులు చూసిన మానవ హక్కుల మండలి వైస్ చైర్మన్ బి.అనిల్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడు హరిబాబును గుర్తించిన పోలీసులు చౌటుప్పల్‌లో  అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనంపాడుకు చెందిన హరిబాబు తంగెడిపల్లిలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News