Ayodhya: మధ్యవర్తిత్వమే మార్గం... అయోధ్య కేసును తేల్చేందుకు ముగ్గురితో కమిటీ వేసిన సుప్రీం!

  • అయోధ్య కేసులో మధ్యవర్తిత్వమే మేలు
  • కమిటీలో ఖలీపుల్లా, రవిశంకర్, శ్రీరాం పంచ్
  • నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రామజన్మభూమి, అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కార మార్గం కనుగొనడం సులభమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అన్ని వర్గాలూ ఓ నిర్ణయానికి వచ్చి, సమస్య సమసిపోవాలంటే, మధ్యవర్తుల నియామకమే మేలైనదని భావిస్తున్నామని ఈ ఉదయం వ్యాఖ్యానించిన అత్యున్నత ధర్మాసనం, ముగ్గురితో కూడిన కమిటీని నియమించింది.

ఈ ప్యానల్ లో జస్టిస్ ఖలీపుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచ్ లు ఉంటారని సుప్రీం పేర్కొంది. మరో నాలుగు వారాల్లో అందరు పిటిషనర్లు, వాద ప్రతివాదులతో చర్చలు జరిపి తమ నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఫైజాబాద్ కేంద్రంగా ఈ ప్రక్రియ మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కొద్దిసేపటి క్రితం సూచించింది. కాగా, అయోధ్యలోని వివాదాస్పద 2.7 ఎకరాల భూమి తమదంటే తమదని హిందూ, ముస్లిం సంఘాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News