niharika: 'సూర్యకాంతం' నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • 'సూర్యకాంతం'గా నిహారిక
  •  మార్క్ కె. రాబిన్ సంగీతం
  •  కృష్ణకాంత్ సాహిత్యం        

నిహారిక ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం' సినిమా రూపొందుతోంది. ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, నిహారిక జోడీగా రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నాగచైతన్య చేతులమీదుగా ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయించారు.

"ఫ్రైడే నైట్ బేబీ .. పార్టీ నైట్ బేబీ .. గో క్రేజీ .. జస్ట్ గో క్రేజీ .. " అంటూ ఈ పార్టీ సాంగ్ సాగుతోంది. మార్క్ కె.రాబిన్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం ఈ పాటను యూత్ కి కనెక్ట్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా పనులు జరుగుతున్నాయి. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందని నిహారిక భావిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను నిహారిక ఎక్కువగా చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

More Telugu News