Hyderabad: హైదరాబాద్‌లో హైఅలర్ట్‌... సైనిక, వాయుసేన శిబిరాల వద్ద భద్రత పెంపు

  • సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నేపథ్యంలో అప్రమత్తం
  • రాజధాని ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌లోనే అధిక సంస్థలు
  • డీఆర్‌డీఓ ల్యాబ్‌, రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలు

సరిహద్దులో సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. సైనికపరమైన శిబిరాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మంగళవారం తెల్లవారు జామున సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలపై మన వాయుసేన దాడులు నిర్వహించి 350 మంది ఉగ్రవాదుల్ని అంతమొందించిన నేపథ్యంలో ప్రతీకార దాడులకు ఆస్కారం ఉందన్న ఉద్దేశంతో హైఅలర్ట్‌ ప్రకటించారు.

 దేశ రాజధాని ఢిల్లీ తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక సంఖ్యలో రక్షణ సంస్థలు ఉన్నాయి. నగరం చుట్టుపక్కల ఉన్న సైనిక, వాయుసేన శిబిరాలతోపాటు రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలు, డీఆర్‌డీఓ ప్రయోగశాల వున్నాయి. దీంతో ఆయా సంస్థల వద్ద నిఘా పెంచారు. సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకుంటుండడంతో అక్కడికి సుదూరంలోనే హైదరాబాద్‌ ఉన్నప్పటికీ కీలక సంస్థలు ఉండడంతో భద్రతా పరంగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News