kalyan ram: '118' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా బాలకృష్ణ - ఎన్టీఆర్

  • గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
  • ఈ రోజు రాత్రికి ప్రీ రిలీజ్ ఈవెంట్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో '118' సినిమా రూపొందింది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాలో నాయికలుగా నివేదా థామస్ .. షాలినీ పాండే నటించారు. పోస్టర్స్ ను రిలీజ్ చేసిన రోజు నుంచే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ .. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి రెడీ అవుతోంది.

హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. వైభవంగా జరగనున్న ఈ వేడుకకి బాలకృష్ణ - ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అయినా కల్యాణ్ రామ్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News