balakrishna: యూఎస్ఏ లో 119 లొకేషన్స్ లో 'మహానాయకుడు' రిలీజ్

  • 'మహానాయకుడు' విషయంలో క్రిష్ జాగ్రత్తలు
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్
  •  హైలైట్ కానున్న రానా పాత్ర

ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'మహానాయకుడు' సినిమాను ఈ నెల 22వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం .. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు .. అనుకున్నది సాధించేవరకూ ఆయన సాగించిన పోరాటం .. మహానాయకుడిగా ఎదిగిన తీరును ఈ భాగంలో చూపించనున్నారు.

యూఎస్ఏ లో ఈ సినిమా ప్రీమియర్ షోలను ఈ నెల 21వ తేదీన 119 లొకేషన్స్ లో ప్రదర్శించనున్నారు. ఈ భాగంలో చంద్రబాబు నాయుడుగా రానా చేసిన పాత్ర హైలైట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇక హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ముందుగా వచ్చిన 'కథానాయకుడు' ఆశించినస్థాయిలో ఆదరణ పొందకపోవడంతో, 'మహానాయకుడు' నిడివి విషయంలో క్రిష్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి మరి.

More Telugu News