kalyan ram: '118' అంటే ఏమిటనే అందరూ చర్చించుకుంటున్నారు: నివేదా థామస్

  • గుహన్ దర్శకత్వంలో '118'
  • అందరూ కష్టపడి పనిచేశారు
  •  ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని భావిస్తున్నాను  

కల్యాణ్ రామ్ తన తాజా చిత్రంగా '118' సినిమా చేస్తున్నారు. గుహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే నటిస్తున్నారు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక మొదలైంది. ఈ వేదికపై నివేదా థామస్ మాట్లాడుతూ .. " అందరూ కూడా '118' అంటే ఏమిటి? అని చర్చించుకుంటున్నారు.

సినిమా చూస్తున్నప్పుడు '118' అంటే ఏమిటో మెల్లమెల్లగా రివీల్ అవుతూ ఉంటుంది. గుహన్ గారు గొప్ప సినిమాటో గ్రాఫర్. అద్భుతంగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. ఎక్కడా కూడా తొలిసారిగా దర్శకత్వం వహించినట్టుగా అనిపించదు. కల్యాణ్ రామ్ తో కలిసి నటించడం హ్యాపీగా వుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను" అని అన్నారు. 

More Telugu News