shivakarthikeyan: 'సీమరాజా' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

  • తమిళంలో హిట్ కొట్టిన 'సీమరాజా'
  • తెలుగులోను అదే టైటిల్
  • వచ్చేనెల 8వ తేదీన విడుదల

క్రితం ఏడాది తమిళంలో ఘన విజయాలను అందుకున్న చిత్రాల జాబితాలో 'సీమరాజా' కూడా కనిపిస్తుంది. శివకార్తికేయన్ .. సమంత .. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. శివకార్తికేయన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఇమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అలాంటి ఈ సినిమాను అదే టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో సమంత .. కీర్తి సురేశ్ లకు మంచి క్రేజ్ వుంది. అందువలన ఇక్కడ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు. ఇక అదే రోజున 'యాత్ర' విడుదలకానున్న విషయం తెలిసిందే.

More Telugu News