isro: మానవసహిత అంతరిక్ష యాత్రలో ముందడుగు..హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ను ప్రారంభించిన ఇస్రో!

  • వ్యోమగాములు కూర్చునే మాడ్యుల్ ఆవిష్కరణ
  • సెంటర్ ను ప్రారంభించిన మాజీ చైర్మన్ కస్తూరిరంగన్
  • ట్విట్టర్ లో ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

2021లో మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ను చేపడతామని ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామని అప్పట్లో చెప్పింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. తాజాగా ఈ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ‘హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్’ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ ప్రారంభించారు.
మానవసహిత యాత్రకు వెళ్లే వ్యోమగాములు ఇక్కడే శిక్షణ పొందనున్నారు. మరోవైపు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేందుకు అవసరమైన మాడ్యుల్ ను సైతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

More Telugu News