Andhra Pradesh: పోలీస్ ఇన్ ఫార్మర్ అన్న అనుమానం.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపేసిన మావోయిస్టులు!

  • మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘటన
  • ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన మావోలు
  • అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్న అధికారులు

మావోయిస్టుల ఏరివేతకు భద్రతాబలగాలు ‘ఆపరేషన్ సమాధాన్’ను చేబట్టడంతో, దీనికి వ్యతిరేకంగా మావోయిస్టులు ఈరోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన వలెవంజ కుజెమి(50) అనే వ్యక్తిని ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. అనంతరం ప్రజాకోర్టులో విచారించి పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు.

చివరికి పెనుగుండ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహంపై ఓ  కరపత్రాన్ని విడిచివెళ్లారు. అందులో పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేయడంతోనే కుజెమిని చంపేశామని మావోలు స్పష్టం చేశారు. కాగా, భారత్ బంద్ తో పాటు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులతో పాటు భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.

More Telugu News