raviteja: రవితేజ పుట్టినరోజున రానున్న ఫస్టులుక్

  • వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ
  •  స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టు ప్రకటన కూడా అదేరోజు  

'రాజా ది గ్రేట్' తరువాత రవితేజకి హిట్ లేదు. దాంతో ఆయన ఈసారి తప్పకుండా సక్సెస్ ను సాధించాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. క్రితం నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కథా కథనాలు మరింత పట్టుగా వచ్చేలా రవితేజ జాగ్రత్తలు తీసుకోవడంతో ఆలస్యమైంది.

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ నెల 26వ తేదీన రవితేజ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆ రోజున టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికలుగా నాభా నటేష్ .. పాయల్ రాజ్ పుత్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడనుందని సమాచారం.

More Telugu News