kcr: కేసీఆర్ యాగానికి సర్వం సిద్ధం.. ఫాంహౌస్ లో రేపట్నుంచే యాగం

  • చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగాన్ని నిర్వహించనున్న కేసీఆర్
  • రేపటి నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనున్న యాగం
  • 3 యాగశాలలు, 27 హోమగుండాల ఏర్పాటు

మరో మహా యాగాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు తన ఫాంహౌస్ లో చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కొనసాగనుంది. యాగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ స్వయంగా యాగానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులతో 200 మంది రుత్విక్కులు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు.

యాగశాల పనులను శారదా పీఠం వేద బ్రాహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఫాంహౌస్ లో దక్షిణ ద్వారాన్ని ఆనుకుని యాగశాలను నిర్మించారు. మూడు యాగశాలలతో పాటు 27 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఈ యాగానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లకు ఆహ్వానాలు పంపించారు. ఇప్పటికే చండీయాగం, రాజశ్యామల యాగాలను కేసీఆర్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

More Telugu News