Karnataka: కర్ణాటకలో రాజకీయ హైడ్రామా.. సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు?

  • కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణాన్ని దెబ్బకొట్టే యత్నం
  • పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు?
  • కొత్త ప్రభుత్వం వస్తుందంటున్న బీజేపీ

కర్ణాటకలో రాజకీయ హై డ్రామాకు తెరలేచింది. సంక్రాంతి తర్వాత కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణాన్ని దెబ్బకొట్టేందుకు బీజేపీ యత్నాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది.

‘ఆపరేషన్ కమల్’ దిశగా బీజేపీ తన అడుగులు ప్రారంభించింది. తమ పార్టీలో చేరేందుకు 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతుండటం ఇందుకు నిదర్శనం. కాగా, బీజేపీ ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టడం ఖాయమని కర్ణాటక సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవెగౌడ, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేకు ఒక్కొక్కరికి రూ.30 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News