Telangana: తెలంగాణలో చంపేస్తున్న చలి.. తట్టుకోలేక ఇద్దరి మృతి

  • ఉత్తరాది నుంచి ఆగని శీతల గాలులు
  • పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  • వికారాబాద్ జిల్లాలో ఇద్దరి మృతి

తెలంగాణలో చలి మరింత విజృంభిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలులకు రాష్ట్రం గడ్డకట్టుకుపోతోంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలికి తట్టుకోలేక వికారాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కొడంగల్‌కు చెందిన రాములు, వికారాబాద్‌కు చెందిన జంగయ్య (54) చలి తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్, మెదక్‌లలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, రామగుండంలో 9, హైదరాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు కూడా చలి తీవ్రత ఉంటుందని పేర్కొంది.

More Telugu News