vijay sethupathi: ఈ ఏడాది ఆర్థికంగా పెద్ద దెబ్బే తగిలింది: హీరో విజయ్ సేతుపతి

  • విలక్షణ నటుడిగా మంచి క్రేజ్ 
  • '96' మూవీతో భారీ హిట్ 
  • 'జుంగా' సినిమాతో భారీ నష్టం

తమిళనాట విలక్షణమైన నటుడిగా విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ వుంది. ఈ ఏడాది ఆయనకి మంచి మంచి పాత్రలు పడ్డాయి. ఈ ఏడాది ఆయన చేసిన 'నవాబ్' నటుడిగా ఆయన స్థానాన్ని మరింత పెంచింది. ఇక ఆయన చేసిన '96' మూవీ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. అందువలన ఈ ఏడాది ఆయనకి బాగా కలిసొచ్చిందని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు.

అయితే, విజయ్ సేతుపతి మాత్రం ఈ ఏడాది ఆర్థికంగా తనకి పెద్ద దెబ్బే తగిలిందని సన్నిహితులతో చెబుతున్నాడట. ఈ ఏడాది జూలైలో వచ్చిన 'జుంగా' సినిమాకి విజయ్ సేతుపతి కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా కోసం ఆయన 11 కోట్లు ఖర్చు చేశాడు. దాదాపు విదేశాల్లోనే షూటింగ్ జరుపుకున్న 'జుంగా' పరాజయం పాలైంది. దాంతో విజయ్ సేతుపతికి 11 కోట్ల నష్టం వచ్చింది. ఆ తరువాత ఆయన చేసిన మూడు సినిమాల పారితోషికంతో ఆ అప్పులు తీర్చినట్టుగా తెలుస్తోంది. 

More Telugu News