Yadadri Bhuvanagiri District: యాదాద్రిలో చిన్నారుల వ్యభిచారం కేసు.. ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు!

  • హైకోర్టులో చిన్నారుల వ్యభిచారం కేసు 
  • ప్రత్యేక న్యాయస్థానం అవసరమన్న హైకోర్టు 
  • కొత్త న్యాయస్థానం ఫ్రెండ్లీ కోర్టుగా ఉంటుందని వ్యాఖ్య

పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట సమీపంలో చిన్నారులతో కొందరు వ్యభిచార వృత్తిని నిర్వహిస్తున్న విషయం ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తుతం హైకోర్టు స్వయంగా విచారిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురు చిన్నారులను రక్షించిన పోలీసులు వారిని రెస్క్యూ హోమ్స్ కు తరలించారు. ఈ విషయంలో తాజాగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది.

చిన్నారులను వ్యభిచార రొంపిలోకి దించిన వ్యవహారంపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపింది. ఇది చిన్నారులకు ఫ్రెండ్లీ కోర్టుగా ఉంటుందని వెల్లడించింది. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.

More Telugu News