mohanlal: 'మహాభారతం' ప్రాజెక్టు అందుకే పట్టాలెక్కలేదు: మోహన్ లాల్

  • భీముడి కోణంలో సాగే 'మహాభారతం'
  • రచయితగా వాసుదేవన్ నాయర్ 
  • దర్శకుడిగా శ్రీకుమార్ మీనన్  

విభిన్నమైన కథా చిత్రాలను అంగీకరిస్తూ .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ మోహన్ లాల్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి మోహన్ లాల్ ప్రధాన పాత్రగా మలయాళంలో 'మహాభారతం' సినిమా రూపొందనున్నట్టు వార్తలు వచ్చాయి. వాసుదేవన్ నాయర్ రాసిన ఒక గ్రంధం ఆధారంగా భీముడి కోణంలో మహాభారతాన్ని తెరపై ఆవిష్కరించాలని అనుకున్నారు.

శ్రీకుమార్ మీనన్ దర్శకుడిగా వెయ్యి కోట్లతో ఈ సినిమాను నిర్మించడానికి బీఆర్ శెట్టి ముందుకు వచ్చారు. వివిధ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా చేశారు. అలాంటి ఈ సినిమా గురించిన ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో మోహన్ లాల్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ, రచయితకి .. దర్శకుడికి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందనీ, ఇద్దరి మధ్యా అపార్థాలు తొలగిపోతే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెప్పారు. 

More Telugu News