NTR biopic: ‘ఎన్టీఆర్’ నుంచి అప్‌డేట్ ఇస్తూ పోస్టర్ విడుదల

  • సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్’
  • రేపు ట్రైలర్ విడుదల
  • ఈ నెల 21న ఆడియో వేడుక

నటరత్న బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పార్ట్ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రెండో పార్ట్ జనవరి 25న విడుదల కానుంది.  

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ రేపు విడుదలకానుంది. ఇక ఆడియో వేడుక ఈ నెల 21న నిమ్మకూరులో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘ఎన్టీఆర్’లోని బాలకృష్ణ సరికొత్త లుక్‌‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్‌రామ్, సుమంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More Telugu News