mohanlal: విడుదలకి ముందే కొత్త రికార్డును సృష్టించిన 'ఒడియన్'

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • డిఫరెంట్ లుక్స్ తో మోహన్ లాల్ 
  • కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్   

మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో 'ఒడియన్' నిర్మితమైంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మలయాళంతో పాటు తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. మలయాళంలో ఈ స్థాయి బిజినెస్ చేసిన మొదటి సినిమా ఇదే. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఈ కథ గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. డిఫరెంట్ లుక్స్ తో .. సూపర్ పవర్స్ కలిగిన యోధుడిగా ఈ సినిమాలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథానాయికగా మంజు వారియర్ నటించగా .. కీలకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు.

More Telugu News