Kedarnath: ఊహించినట్టుగానే 'కేదార్ నాథ్'పై ఉత్తరాఖండ్ నిషేదం!

  • 'కేదార్ నాథ్' వరదలపై చిత్రం
  • ముస్లిం యువకుడితో ప్రేమలో పడే హీరోయిన్
  • హిందూ సంఘాల ఆగ్రహం

హిమాలయ పర్వతాల్లో ఉన్న కేదార్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని అతలాకుతలం చేసిన వరదలను, ఆలయం చూసేందుకు వచ్చిన ఓ హిందూ యువతి, స్థానిక ముస్లిం యువకుడితో ప్రేమలో పడటం, ఆపై వరదల్లో వారు ఎలా ఇబ్బందులు పడ్డారన్న ఇతివృత్తంతో తయారైన 'కేదార్ నాథ్' చిత్రాన్ని తమ రాష్ట్రంలో ప్రదర్శించకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది.  

సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్, సారా అలీ ఖాన్ ఈ చిత్రంలో నటించగా, ఇది హిందువుల మనోభావాలను గాయపరచేలా ఉందని హిందూ సంఘాలు తీవ్ర నిరసనలను తెలియజేశాయి. దీంతో కేదార్‌నాథ్, ఉదమ్‌ సింగ్ నగర్ సహా మొత్తం ఏడు జిల్లాల్లో ఈ చిత్రాన్ని తొలుత, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

ఈ సినిమా లవ్ జీహాద్‌ ను ప్రోత్సహిస్తోందని కేదార్‌ నాథ్ భక్త మండల్ ఉత్తరాఖండ్ హైకోర్ట్‌ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన ధర్మాసనం, స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సలహా ఇవ్వడంతోనే శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నిషేధం విధించినట్టు ప్రభుత్వం తెలిపింది.

More Telugu News