kalyan ram: కల్యాణ్ రామ్ థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

  • గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ 
  • నాయికలుగా నివేద .. షాలిని పాండే 
  • ఫిబ్రవరిలో సినిమా విడుదల    

కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా కనిపించనున్నారు. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు.

తాజాగా '118' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. కథకు .. ఈ నెంబర్ కు సంబంధం వుంటుందట .. అందువల్లనే ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. కొంతకాలంగా కల్యాణ్ రామ్ వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడట. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.       

More Telugu News