Viplav Dev: మేడే విషయమై వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కిన త్రిపుర సీఎం

  • ప్రభుత్వోద్యోగులు కార్మికులు కాదు
  • ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు ఇవ్వాలి?
  • కర్మాగారాలలో పనిచేసే లేబర్‌కి మాత్రమే సెలవు

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌కి కొత్తేం కాదు. కార్మిక దినోత్సవం గురించి ఆయన చేసిన కామెంట్లతో మరోసారి విప్లవ్ వార్తల్లో నిలిచారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే విషయమై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వోద్యోగులు లేబర్ కాదని.. వారికి సెలవు అనవసరమని తెలిపారు.

నేడు త్రిపురలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ్ దేవ్ మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వోద్యోగులు కార్మికులు కాదు. కర్మాగారాలలో పనిచేసే లేబర్‌కి మాత్రమే ఆ రోజున సెలవు ఇస్తారు. మరి మేడే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు ఇవ్వాలి? అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై ఆ రోజున సెలవు ఇచ్చేది లేదు’’ అన్నారు. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

More Telugu News